చైన్ స్నాచర్ల కోసం పోలీసుల తనిఖీలు

చైన్ స్నాచర్ల కోసం పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‭లో నిన్న ఒక్క రోజులోనే వరుసగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో.. బంజారాహిల్స్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. మసబ్ ట్యాంక్ నుంచి విరించి వచ్చే మార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే చైన్ స్నాచర్ల ఫోటోలతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితులను గుర్తిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, పంజాగుట్ల ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తున్న పోలీసులు.. డాక్యుమెంట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఫోటోలోని వ్యక్తులు చైన్స్ స్నాచింగ్ చోరీలకు పాల్పడే ముఠాగా పోలీసులు గుర్తించారు. ఈ ఫోటోలోని వ్యక్తులు ఎక్కడైనా కనిపించినట్లైతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మరోవైపు సైబరాబాద్లో కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్ సంఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి. గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో స్నాచర్లను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.