ఆర్థిక ఇబ్బందులతోనే డ్రగ్స్ బిజినెస్‌‌‌‌లోకి

ఆర్థిక ఇబ్బందులతోనే డ్రగ్స్ బిజినెస్‌‌‌‌లోకి

ఖైరతాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీని టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు రెండోరోజు విచారించారు. ఆర్థిక లావాదేవీల గురించి ప్రధానంగా విచారణ జరిగిందని, కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. టోనీ దగ్గర నుంచి 2 సెల్‌‌‌‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఆధారాలు దొరకకుండా ముందుజాగ్రత్తగా.. వాట్సాప్‌‌‌‌, ఫేస్‌‌‌‌టైమ్‌‌‌‌తోపాటు సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌లోని మొత్తం డేటాను టోనీ డిలీట్‌‌‌‌ చేశాడు. డేటా అనాలసిస్‌‌‌‌ కోసం అతని సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ను ఫోరెన్సిక్‌‌‌‌కు పంపించారు. టోనీ కాంటాక్ట్స్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ను రిట్రీవ్‌‌‌‌ చేసిన పోలీసులకు కొందరు బిజినెస్‌‌‌‌మ్యాన్‌‌‌‌లతో అతను టచ్‌‌‌‌లో ఉన్నట్టు గుర్తించారు. వీరి మధ్య ఉన్న సంబంధాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే డ్రగ్స్ బిజినెస్‌‌‌‌లోకి వచ్చినట్టు టోనీ పోలీసులకు తెలిపాడు. నైజీరియాకు చెందిన వ్యక్తి చెప్పడంతోనే ఇండియాకు వచ్చానని చెప్పాడు. టోనీ బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ ఆధారంగా విచారణ జరిగింది. దాదాపు పది బ్యాంక్‌‌‌‌ అకౌంట్లను టోనీ వాడినట్టు గుర్తించారు. అలాగే బాబు షేక్, నూర్‌‌‌‌‌‌‌‌లతో టోనీకి ఉన్న ఫైనాన్షియల్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ను కూడా పోలీసులు సేకరించారు.