
- 15 నిమిషాల్లో రూ.1.18 లక్షలు రికవరీ
బషీర్‌బాగ్, వెలుగు: ఇద్దరు బాధితుల నుంచి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైం పోలీసులు ఝలక్ ఇచ్చారు. డబ్బులు మాయమైన వెంటనే స్పందించి వాటిని నేరగాళ్ల ఖాతాలకు మళ్లకుండా జాగ్రత్త పడ్డారు. సైబర్ క్రైం డీసీపీ దార కవిత తెలిపిన ప్రకారం.. మోగల్‌పురాకు చెందిన ఓ వ్యక్తికి ఆర్టీవో చలాన్ పేరుతో ఏపీకే ఫైల్ పంపారు. అది ఇన్స్టాల్ చేయడంతో అతడి క్రెడిట్ కార్డు ద్వారా స్కామర్లు ఈ కామర్స్ యాప్స్ లో రూ.95,239 విలువైన ఆర్డర్లు పెట్టారు.
ఇదే తరహాలో అశోక్‌నగర్‌కు చెందిన ఓ టెకీ కార్డుతో రూ.23,532 విలువైన ఆర్డర్లు చేశారు. బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో.. కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ సకాలంలో స్పందించి ఆ ఆర్డర్లను రద్దు చేయించారు. సైబర్ చీటర్స్ కాజేసిన రూ.లక్షా 18 వేలు 15 నిమిషాల్లో పోలీసులు రికవరీ చేశారు.