
అతనో పోలీస్ సీఐ.. హైదరాబాద్ సిటీ పరిధిలో పని చేస్తుంటారు.. స్టేషన్లలో పని చేయకపోయినా.. అన్ని స్టేషన్లను కంట్రోల్ చేసే కమాండ్ కంట్రోల్ రూంలో సీఐగా పని చేస్తున్నారు. ఆ సీఐ పేరు శ్రీనివాస్. పదవి,పేరు ఇంతా బాగుంది కానీ ఈయన చేసిన పని అస్సలంటే అస్సలు బాలేదు. ఇంతకీ ఏం చేశాడంటే..
మాములుగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో దొరికన వాళ్లను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తారు. కానీ పోలీసులే తప్ప తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో దొరికితే ఎలా ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ శ్రీనివాస్ తప్ప తాగి కారు నడిపి కూరగాయల వాహనాన్ని ఢీ కొట్టాడు.. రాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాన్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
శ్రీనివాస్ రాత్రి సమయంలో వాహనాన్ని వేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాన్ ఢీకొట్టడంతో అందులో ఉన్న డ్రైవర్ శ్రీధర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా అతని వాహానం కూడా నుజ్జునుజ్జు అయింది. గాయపడిన శ్రీధర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
సి ఐ శ్రీనివాస్ ప్రస్తుతం డీఎస్పీ ప్రమోషన్ లో ఉన్నట్లు సమాచారం.. ప్రమాదానికి గురైన కారు వ్యాన్ లను బొల్లారం పిఎస్ కు తరలించారు. సీఐ శ్రీనివాస్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా అందులో 210 పాయింట్లు వచ్చింది.