ఈ నెల 16లోగా గన్స్​ను..పీఎస్​లో ​డిపాజిట్ చేయండి : సీవీ ఆనంద్

ఈ నెల 16లోగా గన్స్​ను..పీఎస్​లో ​డిపాజిట్ చేయండి : సీవీ ఆనంద్
  • ఆదేశాలు జారీ చేసిన 3 కమిషనరేట్ల సీపీలు

హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాలు, పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా  ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా లైసెన్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గన్స్​ను స్వాధీనం చేసుకుంటున్నారు. గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్ ఉన్న వారు వాటిని ఈ నెల 16వ తేదీలోగా స్థానిక పోలీస్ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి గ్రేటర్​లోని 3 కమిషనరేట్ల సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు.

లైసెన్స్డ్ గన్స్ ఉన్నవాళ్లు స్థానిక పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ లేదా అధికారిక ఆయుధాల డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద తమ గన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిపాజిట్ చేయాలని సూచించారు. ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10న తిరిగి రిలీజ్ చేసుకోవాలని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు కావాలనుకునే వారు గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆఫీసులోని డిస్ట్రిక్ట్ ఆర్మ్ స్క్రీనింగ్ కమిటీకి అప్లయ్ చేసుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం స్పెషల్ బ్రాంచ్​ ఏసీపీ ఎన్. తిరుపతిరావు నం. 9490617429ను సంప్రదించాలన్నారు.