
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో రాంగ్ రూట్ డ్రైవింగ్పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాలను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి, వారంలో 10 వేల 652 మందిపై కేసులు నమోదు చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రాణాంతకమని, దీన్ని పూర్తిగా మానుకోవాలని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను ఫేస్‌బుక్, ఎక్స్ ద్వారా లేదా హెల్ప్‌లైన్ నంబర్లు 9010203626, 8712661690కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో చాలామంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెవిలో ఇయర్ఫోన్స్పెట్టుకుని పాటలు వినడం, కాల్స్మాట్లాడడం చేస్తున్నారని, వీడియోలు కూడా చూస్తున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై ఆయన ఎక్స్లో ట్వీట్‌చేశారు.
హైదరాబాద్ సిటీలో ఆటోలు, క్యాబ్, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు డ్రైవింగ్చేస్తున్నప్పుడు చెవిలో ఇయర్ఫోన్స్పెట్టుకుని నిమిషాల తరబడి మాట్లాడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. మన మెదడు మల్టీ టాస్కింగ్( ఒకేసారి రెండు పనులు చేయడం) చేస్తున్నప్పుడు తికమక పడి ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఇయర్ ఫోన్స్ డ్రైవర్ దృష్టిని మరల్చి, ప్రమాదాలను పెంచుతాయన్నారు. డ్రైవర్లు రూల్స్ పాటించకపోతే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.