జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కేసు..సునీత కుమార్తె అక్షరపై కూడా..

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కేసు..సునీత కుమార్తె అక్షరపై కూడా..

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె అక్షరపై పోలీసు కేసు నమోదైంది. గత శుక్రవారం వెంకటగిరిలోని మసీదు దగ్గర ప్రార్థనలు ముగించుకొని బయటకు వస్తున్న ముస్లిం సోదరులను బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె అక్షర కలిసి ఓట్లు అడిగారని జీహెచ్ఎంసీ డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై స్థానిక పీఎస్​లో కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల నిబంధనను ఉల్లంఘించి మసీదు దగ్గర ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రచారం చేశారని ఫిర్యాదులో  పేర్కొన్నారు.