ఐబొమ్మ రవి అరెస్ట్‌తో ఊరట చెందిన తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు నాలుగు రోజులు తిరగకముందే మళ్లీ షాక్ తగిలింది. రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడితోనే ఐబొమ్మ, బప్పం సైట్లను క్లోజ్చేయించిన సంగతి తెలిసిందే. అయితే ‘‘ఐబొమ్మ వన్’’ పేరుతో గురువారం కొత్త వెబ్‌సైట్ కనిపించడం కలకలం రేపింది.
ఈ సైట్‌లో కొత్త సినిమాలు కనిపించగా వాటిపై క్లిక్ చేస్తే మూవీ రూల్జ్అనే పైరసీ ప్లాట్‌ఫామ్‌లకు రీడైరెక్ట్ అవుతున్నది. ఐబొమ్మ గ్లోబల్ నెట్ వర్క్ టీమ్ ఈ పైరసీ వెబ్ సైట్లు నిర్వహిస్తుందా? లేక కొత్తవారు తయారు చేశారా అన్నది తేలడం లేదు. ఈ నేపథ్యంలో మూవీరూల్జ్, తమిళ్‌ఎమ్‌వీ వంటి సైట్లపై కూడా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఐబొమ్మ అయిపోయింది.. ఇప్పుడు మూవీ రూల్జ్
ఐబొమ్మ రాకముందు నుంచే మూవీ రూల్జ్‌లో కొత్త కొత్త సినిమాలు ఉండేవి. ఇందులో రెండు రకాల పైరసీ మూవీలు పెట్టేవారు. ఒకటి థియేటర్లలో స్పైకెమెరాలు, ఫోన్ ద్వారా రికార్డ్ చేసినవి కాగా రెండోది సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి డౌన్ లోడ్ చేసినవి. రెండు నెలల కింద హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు బిహార్‌కు చెందిన అశ్వనీకుమార్ ను అరెస్ట్ చేశాడు. ఇతడు డిజిటల్ సినిమా ప్యాకేజీలు తయారు చేసి, డిస్ట్రిబ్యూషన్ సంస్థల సర్వర్లను హ్యాక్‌చేసి విడుదలకు ముందే వాటిని దొంగిలించి మూవీ రూల్జ్కు ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
అయితే, మూవీ రూల్జ్ కు సంబంధించి అసలు అడ్మిన్ ఎవరన్నది ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. ఐబొమ్మను క్లోజ్‌చేసిన నాలుగు రోజులకే ఐబొమ్మ వన్అంటూ వచ్చిన వెబ్ సైట్ ప్రేక్షకులను మూవీ రూల్జ్కు తీసుకువెళ్లడం సంచలనంగా మారింది. ఇప్పుడు పోలీసుల టార్గెట్ మూవీ రూల్జ్ గా మారింది. రోజుకు వందల్లో పైరసీ సైట్లు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఐబొమ్మ రవి లేక మూవీ రూల్జ్నిర్వాహకులనో అరెస్ట్ చేస్తే కొద్ది రోజుల వరకు బ్రేక్పడొచ్చు గానీ, పైరసీ సమూలంగా ఆగిపోయే అవకాశమే లేదని ఎక్స్పర్ట్స్అంటున్నారు.
