చాలా మందికి సొంతిల్లు ఒక కల. అయితే ఉన్నంతలో ఇల్లు కట్టుకోవాలని అందరూ అనుకుంటారు. ఉత్తరం ద్వారం ఉన్న ఇంట్లో పూజగది ఎక్కడ ఉండాలి.. దక్షిణం వైపు ఖాళీ స్థలం ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ( 9440088799) గారి సలహాలను ఒకసారి చూద్దాం. .
ప్రశ్న: ఉత్తరం వైపు ప్రధాన ద్వారం ఉన్న ఇంటికి పూజ గది, డైనింగ్ హాల్ ఎటువైపు కట్టుకుంటే మంచిది?
జవాబు: ఉత్తరం దిక్కు మెయిన్ డోర్ ఉన్నప్పుడు తూర్పు సెంటర్ లో పూజ గది ఉండాలి. ఇలా పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు పడమరవైపు చూస్తున్నట్లుగా ఉండాలి. మీరు తూర్పు వైపు చూస్తూ దేవుడ్ని పూజించాలి. అలాగే ఈశాన్యంలో పూజ గది .. అక్కడ బరువు ఉండకపోవడమే మంచిది. కట్టుకునేటప్పుడే కొంచెం పక్కకు మార్చుకుని, తూర్పు సెంటర్లో ఉండేలా కట్టుకుంటే బాగుంటుంది. ఉత్తరం సెంటర్లో డైనింగ్ హాల్ కట్టుకోవచ్చు.
ప్రశ్న: ఇంటి దక్షిణ ప్రహరీకి ఆనుకుని, వెనుకవైపు ఖాళీ స్థలం అమ్మకానికి ఉంది. ఆ స్థలాన్ని కొనుక్కోవచ్చా?
జవాబు: ఇంటికి దక్షిణం వైపు స్థలం తీసుకోకపోవడమే మంచిది. ఇలాంటి స్థలంతో ఇబ్బందులు రావచ్చు. అలాగే పడమర దిక్కు స్థలం కూడా కొనుక్కోకూడదు. ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిక్కుల్లో ఖాళీ స్థలం. కొనుక్కోవచ్చని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు
