
- రోడ్ సేఫ్టీపై అవేర్‌నెస్‌కు ‘వీ కాప్’
- స్కూల్ స్టూడెంట్స్‌తో సిటీ పోలీసుల కొత్త ప్రోగ్రామ్
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్పెట్టినా, చలాన్లు వేసినా కొందరు పట్టించుకోవడం లేదు. తమతోపాటు ఎదుటి వాళ్ల ప్రాణాలనూ రిస్క్‌లోకి నెడుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల లెక్కల ప్రకారం సిటీలో 60 శాతం మంది హెల్మెట్ పెట్టుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సిటీ పోలీసులు వీ -కాప్ అనే కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించారు. ట్రాఫిక్, రోడ్ సేఫ్టీపై ఇంటి నుంచే అవగాహన మొదలవ్వాలనే లక్ష్యంతో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్కూల్ స్టూడెంట్స్‌ను భాగస్వాములను చేస్తూ నార్త్ జోన్ పరిధిలో షురూ చేశారు. కమిషనర్ అంజనీకుమార్ తార్నాకలోని ఎన్ఐఎన్లో మంగళవారం ప్రారంభించారు.
4 లక్షల మంది స్టూడెంట్స్‌తో ..
సిటీలోని గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లలో చదివే 4 నుంచి ఏడో తరగతి స్టూడెంట్స్ దాదాపు 4 లక్షల మందిని వీ కాప్ (చోటా పోలీస్) ప్రోగ్రామ్‌లో భాగస్వాములను చేస్తారు. యాక్షన్, అవేర్ నెస్, ఇంటర్ వెన్షన్ అనే 3 అంశాల ఆధారంగా స్టూడెంట్స్‌కు అవేర్నెస్ కల్పిస్తారు. వారు నేర్చుకున్న అంశాలను పేరెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, చుట్టుపక్కల వాళ్లకు చెప్పి చైతన్యం చేస్తుంటారు. పిల్లల పెర్ఫార్మెన్స్ పరిశీలించేందుకు 12 అంశాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను పోలీసులుఅందిస్తారు. అలా గ్రేడ్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. ప్రారంభ కార్యక్రమంలో వీకాప్ వీడియో ప్లే చేశారు. ఓ తండ్రి తన కూతురును కారులో స్కూల్‌కు తీసుకెళ్లేప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతాడు. సిగ్నల్ జంప్ చేశాడు. అవన్నీ కూతురు నోట్ చేసి, రూల్స్ బ్రేక్ చేస్తున్నందుకు రేపటి నుంచి డ్రైవింగ్ చేయొద్దని వార్నింగ్ఇవ్వడం అందులో ఉంది.
6 నెలల్లో 139 మంది మృతి
హైదరాబాద్, వెలుగు: కరోనా కాలంలోనూ సిటీ రోడ్లపై యాక్సిడెంట్లు తగ్గలేదు. ఈ ఏడాది మొదటి 6 నెలల ట్రాఫిక్ వయొలేషన్, రోడ్డు యాక్సిడెంట్స్ వివరాలను అడిషనల్ సీపీ(ట్రాఫిక్) అనీల్‌కుమార్ మంగళవారం రిలీజ్చేశారు. జూన్30 వరకు 139 మంది మృతి చెందగా, అందులో 88 మంది కాలినడక వెళ్తున్న వాళ్లున్నారు. ఓవర్ స్పీడ్‌తో 90 మంది, డ్రంకన్ డ్రైవ్‌తో 8మంది, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌లో ఇద్దరు, నిర్లక్ష్యంతో ఇద్దరు, కుక్కలు అడ్డు రావడంతో నలుగురు చనిపోయారు.
లాక్‌డౌన్‌లోనూ తగ్గని రోడ్ డెత్స్
మార్చి 23 లాక్‌డౌన్ మొదలు సిటీ రోడ్లపై రద్దీ తగ్గింది. 10లక్షల మంది దాకా సొంతూళ్లకు వెళ్లారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్ వర్క్‌ఫ్రం హోమ్ చేస్తుండడంతో ఐటీ కారిడార్ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సిటీ బస్సులూ రోడ్డెక్కలేదు. విద్యాసంస్థలు, సినిమా థియేటర్స్, బార్లు ఓపెన్ కాలేదు. రాత్రి పూట కర్ఫ్యూ నడుస్తోంది. అయినా మార్చి నుంచి జూన్ 30 వరకు జరిగిన యాక్సిడెంట్లలో 58 మంది చనిపోయారు. ప్రమాదాలకు కారణాలపై ట్రాఫిక్ పోలీసులు స్టడీ చేస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన 60 బ్లాక్ స్పాట్స్‌లో నివారణ చర్యలకు ప్లాన్ చేస్తున్నారు.
కేసులు ఇలా.. (జనవరి నుంచి జూన్ 30 వరకు)
వయొలేషన్ 2019 2020
నో హెల్మెట్ 18,12,198 22,26,625
నో లైసెన్స్ 7,612 10,514
ట్రిపుల్ రైడింగ్ 43,759 44,098
రాంగ్ సైడ్ డ్రైవింగ్ 1,05,346 87,891
నంబర్ ప్లేట్ టాంపరింగ్ 63,235 69,536
నో పార్కింగ్ 1,23,460 1,53,207
సెల్‌ఫోన్ డ్రైవ్ 10,685 12,019
మైనర్ డ్రైవింగ్ 2,732 1,049
డేంజరస్ డ్రైవింగ్ 25,852 89,871
సిగ్నల్ జంప్ 19,540 16,373
స్కూలింగ్ నుంచే ఫౌండేషన్
అవేర్నెస్ లేక సిటీ రోడ్లపై యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్ తరాల్లో మార్పులు తీసుకురావాంటే స్కూలింగ్ నుంచే ఫౌండేషన్ పడాలి. పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వింటారని వీ కాప్ ప్రారంభించాం.
– అంజనీకుమార్, సీపీ