WCL 2025: వెస్టిండీస్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు.. సెమీస్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఢీ

WCL 2025: వెస్టిండీస్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు.. సెమీస్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఢీ

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 సీజన్‌లో ఇండియా ఛాంపియన్స్ అద్భుతం చేసింది. మంగళవారం (జూలై 29) వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయాన్ని అందుకొని సెమీస్ లోకి అడుగు పెట్టింది. వెస్టిండీస్ ఛాంపియన్స్ పై  145 పరుగుల లక్ష్యాన్ని మన జట్టు 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేస్తేనే సెమీస్ కు వెళ్తుంది. లేకపోతే గెలిచినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ దశలో ఇండియా ఛాంపియన్స్ ఓడిపోయే మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 145 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేజ్ చేసి సెమీస్ కు అర్హత సాధించింది. 

ALSO READ | IND vs ENG 2025: ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు బుమ్రా ఔట్.. తుది జట్టులో ఆకాష్ దీప్

ఛేజింగ్ లో ఇండియా ఒక దశలో 7 ఓవర్లలో 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సెమీస్ కు చేరాలంటే 43 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా సెమీస్ అవకాశాలు చాలామంది వదిలేసుకున్నారు. అయితే స్టువర్ట్ బిన్నీ (50: 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు.. యూసఫ్ పఠాన్ (7 బంతుల్లో 21), యువరాజ్ సింగ్(11 బంతుల్లో 21) చివర్లో పవర్ హిట్టింగ్ తో ఇండియా ఛాంపియన్స్ విజయం సాధించింది. ఈ టోర్నీలో తొలి విజయం సాధించిన మన జట్టు సెమీస్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా పొలార్డ్ ఒంటరి పోరాటంతో విండీస్ జట్టును నిలబెట్టాడు. 74 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రథమమైన స్కోర్ అందించాడు. లక్ష్య ఛేదనలో ఇండియా ఛాంపియన్స్ 13.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బిన్నీ (50: 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.