
న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట లోపే వేడుకలు ముగించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు. న్యూయర్ మార్గదర్శకాలను జారీ చేశారు.
పోలీసుల సూచనలు, హెచ్చరికలు ఇవే
* ప్రతి ఈవెంట్‌లో సెక్యూరిటీ తప్పనిసరి.
* సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దు.
* పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.
* సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తపడాలి.
* మద్యం అనుమతించే ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు.
* వేడుకల్లో డ్రగ్స్ వాడినా, వేడుకలకు అనుమతించిన సమయం ముగిసిన తర్వాత లిక్కర్ సరఫరా చేసినా కఠిన చర్యలు.
* మద్యం తాగి వాహనాలు నడపరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా, ఆర్నెళ్లు జైలు శిక్ష.