పోలీసులకు డ్యూటీలు వేసిన ఏఐ

పోలీసులకు డ్యూటీలు వేసిన ఏఐ

హైదరాబాద్​సిటీ, వెలుగు :  సిటీ ఆర్ముడ్​ రిజర్వ్ సిబ్బంది డ్యూటీల కేటాయింపులో ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని సీపీ వీసీ సజ్జనార్‌‌ మంగళవారం బషీర్‌‌బాగ్‌‌లోని పాత కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. మాన్యువల్ విధానంలో విధుల కేటాయింపుతో ఆలస్యం, అసంతృప్తి ఉండడంతో చెక్ పెట్టేందుకు ఈ పద్ధతిని అమల్లోకి తీసుకువచ్చారు. 

సిబ్బంది సీనియారిటీ, రిజర్వ్‌‌లో ఉన్న రోజులు, రివార్డులు, క్రమశిక్షణ, ఆరోగ్యం వంటి అంశాల ఆధారంగా కంప్యూటరే డ్యూటీలు వేస్తుందన్నారు. డౌట్స్​ తీర్చడానికి ఏఐ చాట్‌‌బాట్ అందుబాటులోకి తీసుకువచ్చారు