బేబీ సినిమాకు మాత్రమే నోటీసులు ఎందుకు.. మరి సెన్సార్ బోర్డు ఎం చేస్తుంది?

బేబీ సినిమాకు మాత్రమే నోటీసులు ఎందుకు.. మరి సెన్సార్ బోర్డు ఎం చేస్తుంది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ ఇష్యూ(Tollywood drugs issue) కలకలం రేపింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14న నిర్మాత సుశాంత్ రెడ్డి(Sushanth reddy)తో పాటు మరో 8 మంది నైజీరియన్స్ ను అరెస్ట్ చేశారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ఈ ఘటనతో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. ఇదే విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన సీవీ ఆనంద్.. తెలుగు సినిమాలపై సీరియస్ అయ్యారు. 

ఇందులో భాగంగా రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ మూవీ బేబీ సినిమా మేకర్స్ కు నోటీసులు పంపారు. బేబీ సినిమాలో చూపించిన చాలా సీన్స్ లాగే నిందితులను అరెస్ట్ చేసిన ప్రాంతంలో  ఉన్నాయని, వాటి పైన సీరియస్ అయ్యారు సీవీ ఆనంద్. ఇలాంటి సీన్స్ జనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, ఇక ముందు వచ్చే సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇక నుండి ప్రతీ సినిమాపై ఫోకస్ పెడతామని ఆయన తెలిపారు. 

అయితే సీవీ ఆనంద్ చేసిన ఈ కామెంట్స్ పై ఆడియన్స్  బిన్నంగా స్పందిస్తున్నారు. సినిమాల్లో ఎలాంటి సీన్స్ ఉండాలో, ఎలాంటివి ఉండకూడదో చూసుకోవడానికి సెన్సార్ బోర్డు ఉంది కదా. ఎలాంటి అసభ్యకరమైన సీన్స్ ఉన్నా వారు తొలగిస్తారు కదా. అలాంటప్పుడు మల్లి మీరు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం ఎందుకు. అలా అయితే సెన్సార్ బోర్డు ను తీసేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇప్పటికే చాలా సినిమాల్లో డ్రగ్స్ వాడకానికి సంబందించిన సీన్స్ వచ్చాయి. కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ మూవీలో ఇలాంటి సీన్స్ చాలానే ఉంటాయి. ఇక రాబోతున్న లియో సినిమా కూడా డ్రగ్స్ బేసెడ్ గానే వస్తన్న సినిమా. మరి ఆ సినిమాల విషయంలో కూడా ఇలానే  ఆజ్ఞలు ఉంటాయా. మిగతా సినిమాలకు లేనిది కేవలం బేబీ సినిమా మేకర్స్ కు మాత్రమే ఇలా నోటీసులు పంపడం కరక్ట్ కాదు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి సీవీ ఆనంద్ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.