ఫోన్ మాట్లాడుతూ నడిపితే డేంజర్ డ్రైవింగ్ కేసులు

ఫోన్ మాట్లాడుతూ నడిపితే  డేంజర్ డ్రైవింగ్ కేసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్డుపై మొబైల్ వాడుతూ వాహనం నడిపితే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని, రిపీట్ అయితే క్రిమినల్​ కేసులు పెడుతామని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే  హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫస్ట్​ టైం డ్రైవింగ్​లో మొబైల్ వాడుతూ పట్టుబడితే రూ.వెయ్యి జరిమానా, రెండోసారి జరిగితే నెగ్లిజెంట్, డేంజరస్​ డ్రైవింగ్​ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇలాంటి కేసులు ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్‌లో 54 వేలు నమోదైనట్లు తెలిపారు. ఫోన్ కాల్స్ వస్తే వాహనం ఆపి మాట్లాడాలని సూచించారు.