కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతిలో ఓడినా.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ (20 పాయింట్లు)తో నాకౌట్ దశకు చేరుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 146/8 స్కోరు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (43), అమన్ రావు (33), తనయ్ త్యాగరాజన్ (27) రాణించారు. 10 రన్స్‌కే రిషికేత్ సిసోడియా (3), తన్మయ్ అగర్వాల్ (5) ఔటయ్యారు. ఈ దశలో అమన్, ప్రజ్ఞయ్ మూడో వికెట్‌కు 75 రన్స్ జోడించారు.
రాహుల్ బుద్ది (13), అర్ఫాజ్ అహ్మద్ (9), మిలింద్ (6) నిరాశపర్చడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేయలేకపోయింది. జగ్జిత్ సింగ్ 3, సందీప్ శర్మ, చిరాగ్ వీర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత చండీగఢ్ 19.5 ఓవర్లలో 147/6 స్కోరు చేసి నెగ్గింది. అర్జున్ ఆజాద్ (63), శివమ్ బాంబ్రీ (42) నిలకడగా ఆడారు. రక్షణ్ రెడ్డి, సీవీ మిలింద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జగ్జిత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
