హైదరాబాద్ లో పలు చోట్ల చిరుజల్లులు

హైదరాబాద్ లో పలు చోట్ల చిరుజల్లులు

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, కూకట్ పల్లి, మాదాపూర్, యూసఫ్ గూడ, అమీర్ పేట, పంజాగుట్ట ,లక్డీకపూల్, మణికొండ, సికింద్రాబాద్, గచ్చిబౌలి ప్రాంతాల్లో  చిరుజల్లులు పడుతున్నాయి. వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఇవాళ మధ్యాహ్నం, సాయంత్రం కూడా  వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.  సెప్టెంబర్ 9 న చాలా చోట్ల,  సెప్టెంబర్ 10 న  కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత ఐదు  రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు   చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.