దిశ ఘటనపై ది పాయింట్ ఆఫ్ వ్యూ

దిశ ఘటనపై ది పాయింట్ ఆఫ్ వ్యూ

సోనియా నాయుడు, పూజా రెడ్డి, సమీర్, సాగర్ లీడ్ రోల్స్‌‌లో నటించిన చిత్రం ‘ది పాయింట్ ఆఫ్ వ్యూ’.  మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో  సత్య చౌదరి నిర్మిస్తున్నారు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ కాంపెల్లి మాట్లాడుతూ ‘దర్శకుడిగా నాకిది తొలిచిత్రమైనా  నా కథపై  నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన సత్య గారికి థ్యాంక్స్.  దిశ  ఘటనతో పాటు కొన్ని  వాస్తవ సంఘటనల ఆధారంగా స్టోరీ రాశా.  

మహిళల పట్ల సమాజంలో అవగాహన పెంచే బలమైన సందేశం ఇవ్వబోతున్నాం’ అని చెప్పాడు.  ఈ సినిమా ఒక కొత్త కోణంలో, విభిన్నమైన అంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోందని, తమను ఆదరించాలని నటీనటులు కోరారు.  మహిళా ప్రధాన కథతో మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించానని   సత్య చౌదరి అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.