ఫ్యామిలీస్కు నచ్చే కంటెంట్‌‌తో రాజా ది రాజా

ఫ్యామిలీస్కు నచ్చే కంటెంట్‌‌తో రాజా ది రాజా

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా అనిల్ బోయిడపు దర్శకత్వంలో  కె. నిహారికా దాసరి నిర్మించిన చిత్రం ‘రాజా ది రాజా’.  మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్  ద్వారా  జులై 17న సినిమా విడుదల  కానుంది. సోమవారం ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.  

ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తుంటే ఇది టీమ్ ఎఫర్ట్‌‌లా అనిపించింది. ఒక పెద్ద సినిమాలోని విజువల్స్‌‌లా అనిపిస్తున్నాయి. పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు వస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు.  

హీరో రుత్విక్ మాట్లాడుతూ ‘ఈ జర్నీ చాలా ఎమోషనల్. నా మొదటి సినిమానే మైత్రి మూవీస్ ద్వారా రిలీజ్ కావడం ఆనందంగా ఉంది.  సాయికుమార్, నరేష్ , అవసరాల శ్రీనివాస్ లాంటి సీనియర్స్‌‌తో నటించడం మంచి ఎక్స్‌‌పీరియెన్స్’ అని చెప్పాడు.  టీజర్, ట్రైలర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు అనిల్ చెప్పాడు.  ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ అని, అందర్నీ అలరిస్తుందని నిర్మాత నిహారిక అన్నారు.  అవసరాల శ్రీనివాస్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.