సికింద్రాబాద్ పరిధిలో విషాదం.. ముషీరాబాద్ రాంనగర్ కాలువలోకి శవం కొట్టుకొచ్చింది..

సికింద్రాబాద్ పరిధిలో విషాదం.. ముషీరాబాద్ రాంనగర్ కాలువలోకి శవం కొట్టుకొచ్చింది..

సికింద్రాబాద్: ముషీరాబాద్ రాంనగర్ కాలువలోకి శవం కొట్టుకొచ్చింది. ముషీరాబాద్ వినోబా నగర్ ప్రేయర్ పవర్ చర్చ్ దగ్గర నివాసం ఉండే అరుణ్ కుమార్ (43) గా పోలీసులు గుర్తించారు. అరుణ్ కుమార్కు మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. గత మూడు నాలుగు నెలలుగా ఫుట్పాత్పై ఉంటూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. 

మంగళవారం ఉదయం 5 గంటలకు అరుణ్ కుమార్ మూత్రానికి బయటికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వరద ఉధృతి కారణంగా అరుణ్ కుమార్ ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షం కురిసి రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షానికి కుత్బుల్లాపూర్ మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ సమీపంలో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. సమీప హాస్టల్స్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కనీస నిబంధనలు పాటించకుండా హాస్టల్ భవనాలు నిర్మించడం వల్లనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికుల ఆగ్రహం చేశారు.