హైదరాబాద్ సిటీలో ముసురు: మరో మూడు రోజులు ఇలాగే: బీ అలర్ట్ హైదరాబాదీలు

హైదరాబాద్ సిటీలో ముసురు: మరో మూడు రోజులు ఇలాగే: బీ అలర్ట్ హైదరాబాదీలు

హైదరాబాద్ సిటీని నల్లటి మేఘాలు కమ్మేశాయి. ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఆవరించిన ద్రోణి, మరో 24 గంటల్లో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడుతుంది. ఆకాశం మేఘావృతం అయ్యి.. సూర్యుడు కనిపించటం లేదు. ఉదయం 11 గంటల నుంచే తెలంగాణ వ్యాప్తంగా జల్లులు మొదలయ్యాయి. హైదరాబాద్ సిటీలో మోస్తరు వర్షం పడుతుంది. 2025 ఆగస్ట్ 13వ తేదీ.. అంటే బుధవారం రోజంతా ఇలాగే వర్షం పడుతుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్ జారీతో.. మోస్తారు నుంచి భారీ వర్షం పడనున్నట్లు వెదర్ డిపార్ట్ మెంట్ సూచించింది. 

ఆగస్ట్ 13వ తేదీ నుంచి మరో మూడు రోజులు అంటే.. 15వ తేదీ శుక్రవారం వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ మూడు రోజులు హైదరాబాద్ సిటీ మొత్తం మోస్తరు నుంచి భారీ వర్షం పడున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. సిటీలో స్కూళ్లకు హాఫ్ డే ప్రకటించారు ఇప్పటికే. రాబోయే మూడు రోజులు పిల్లలకు హాఫ్ డే మాత్రమే స్కూల్స్ నిర్వహించనున్నారు. మరీ భారీ వర్షాలు అయితే సెలవు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్ట్ 15వ తేదీ శుక్రవారం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ సిటీలోనూ ముసురుతో.. మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండటంతో.. ట్రాఫిక్ సూచనలు చేస్తున్నారు పోలీసులు. అత్యవసరం అయితే బయటకు రావాలని కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఐటీ కంపెనీలకు సైతం అలర్ట్ జారీ చేసిన పోలీసులు.. కంపెనీలు అన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని.. ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కకుండా చూడాలని కూడా సూచిస్తున్నారు.

హైదరాబాద్ సిటీలో ఇప్పటికే ముసురు కమ్మేసింది. వర్షం మొదలైపోయింది. ఇలాంటి వాతావరణం.. వర్షం మరో మూడు రోజులు కంటిన్యూగా ఉండనున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. 

సో.. హైదరాబాదీలు బీ అలర్ట్. ఉత్తినే.. ఊరికే రోడ్డెక్కొద్దు.. బయటకు రావొద్దు. అత్యవసరం.. ఎమర్జెన్సీ అయితేనే బయటకు రండి. బయటకు వచ్చి వర్షంలో ఇబ్బంది పడొద్దు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకోవద్దు.. వాతావరణం కూడా బాగోలేదు.. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి.. వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోండి.. చల్లటి పదార్థాల జోలికి వెళ్లొద్దు.. హా.. ఈ వర్షం ఏం చేస్తుందిలే.. ఎప్పుడూ ఉండేదే అని లైట్ తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడటం ఖాయం.. బీ అలర్ట్ హైదరాబాదీలు.. బీ కూల్.. బీ హ్యాపీ..