ఆటను ఎంజాయ్ చేస్తా.. : తిలక్ వర్మ

ఆటను ఎంజాయ్ చేస్తా.. : తిలక్ వర్మ
  •     ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా
  •     ఇండియాకు వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రంజీ ట్రోఫీ గెలవడం నా గోల్
  •      ‘వెలుగు’తో హైదరాబాద్ రంజీ కెప్టెన్ తిలక్ వర్మ

డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దంచికొట్టి, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టి ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన క్రికెటర్ తిలక్ వర్మ. తొలుత టీ20ల్లో, తర్వాత వన్డేల్లో  అరంగేట్రం చేసిన  ఈ హైదరాబాద్ యంగ్‌‌స్టర్ ఇప్పుడు ఇండియా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టాడు. తాను తొందర్లోనే టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తానని అంటున్నాడు. ఆటను ఎంజాయ్ చేస్తూ ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ  ముందుకెళ్తున్నానని చెబుతున్నాడు. మేఘాలయతో రంజీ  ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించిన కెప్టెన్ తిలక్ ఇండియాకు వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రంజీ ట్రోఫీ అందించడం తన లైఫ్ గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ‘వెలుగు’ ఇంటర్వ్యూలో  చెప్పాడు. ఈ టోర్నీ, తన భవిష్యత్తు గురించి తిలక్ చెప్పిన మరిన్ని విషయాలు అతని మాటల్లోనే..

హైదరాబాద్, వెలుగు: ‘నా కెప్టెన్సీలో హైదరాబాద్ టీమ్ ప్లేట్ గ్రూప్ నుంచి ఎలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావడం సంతోషంగా ఉంది. నిజానికి గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతమంది కీలక ఆటగాళ్లు లేకపోవడం, వివిధ కారణాల వల్ల మేం ప్లేట్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోవడమే దురదృష్టకరం. మా టార్గెట్ ఎప్పుడూ రంజీ ట్రోఫీ నెగ్గడమే. రాబోయే రెండేండ్లలో దీన్ని అందుకుంటామని అనుకుంటున్నా. ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రంజీ ట్రోఫీ సాధించడం అనేది నా పర్సనల్ గోల్.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రంజీ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలవడం నాతో పాటు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా చాలా ముఖ్యం అనుకుంటున్నా.  ప్లేట్ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లి ట్రోఫీ గెలిస్తే ఓ చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  

ఫైనల్లో సవాల్ ఎదురైంది

ఈ టోర్నీ మొత్తంలో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాకు సవాల్ ఎదురైంది. చిన్న టీమే అయినా మేఘాలయ బాగా ఆడింది.  చాలా క్రమశిక్షణతో బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో మేం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తడబడ్డాం. కానీ, వెంటనే పుంజుకోవడం మంచి విషయం.  ఫైనల్లో మా బౌలర్లు కూడా బాగా పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఇక, ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన్మయ్, రాహుల్ సింగ్, తనయ్ బాగా ఆడారు. ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్నీ చిన్న జట్లే ఉన్నా మా ప్లేయర్లు వాటిని తక్కువగా అంచనా వేయకుండా ఫోకస్ పెట్టి ఆడారు. వచ్చే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా.

ఐపీఎల్ అందరికీ కీలకమే

ఇప్పటి నుంచి నేను ఆడబోయే ప్రతీ మ్యాచ్ నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముఖ్యం అవుతుంది. రాబోయే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాతో పాటు ప్రతి ఒక్కరికీ కీలకమే. ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఫారిన్ క్రికెటర్లు కూడా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉంటారు. అందరూ బాగా ఆడాలనే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంటారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాణిస్తే  వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాకు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుందా? లేదా? అన్నది నా చేతుల్లో ఉండదు. నేను ఒక్కో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతూ ముందుకెళ్తుంటా. ఒక క్రమ పద్ధతిలో ఆడుతూ ఉంటే ఫలితాలు అవే వస్తుంటాయి.  చిన్నప్పటి నుంచి ఇలానే ఆడుతూ ఈ స్థాయికి చేరుకున్నా. ఇకపై కూడా దీన్నే కొనసాగిస్తా. నేను ఆటను ఎంజాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తా. తర్వాత ఏదైతే అది అవుతుందని అనుకుంటా’. 

టాటూలు అంటే ఇష్టం

నా బాడీపై చాలా టాటూలు ఉన్నాయి. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన తర్వాత మిగతా క్రికెటర్లను చూసి వీటిని వేయించుకోలేదు.  చిన్నప్పటి నుంచే నాకు టాటూలు అంటే ఇష్టం. మొదటగా మా పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోను నడుంపై టాటూగా వేయించుకున్నా. ఆ తర్వాత చాలా వచ్చాయి.

యశస్వి, నా బ్యాటింగ్ ఒకేలా

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా బాగా ఆడుతోంది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడినా పుంజుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా మన యంగ్‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ చాలా దూకుడుగా ఆడుతున్నాడు.  సర్ఫరాజ్ ఖాన్ కూడా తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మంచి స్ట్రయిక్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండు ఫిఫ్టీలు చేయడం గొప్ప విషయం. సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా 4–1తో గెలుస్తుందని అనుకుంటున్నా. జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా.  మేం ఇద్దరం కలిసి చాలా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఆడాము. మా ఇద్దరి బ్యాటింగ్ స్టయిల్ ఒకే రకంగా దూకుడుగా ఉంటుంది. తొందర్లోనే నేను కూడా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తానని అనుకుంటున్నా. అది నా డ్రీమ్ కూడా. ఇందుకోసం చాలా  కష్టపడుతున్నా. రంజీ ట్రోఫీతో పాటు ఇండియా-–ఎ తరఫున బాగానే ఆడుతున్నా. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. ఇలా నిలకడగా ఆడితే  త్వరలోనే  టెస్టు టీమ్ నుంచి పిలుపు వస్తుందన్న నమ్మకం ఉంది.