హైదరాబాద్: నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు .. స్కూల్ పై ఎగిరిపడ్డ బండ రాళ్లు

హైదరాబాద్: నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు .. స్కూల్ పై ఎగిరిపడ్డ బండ రాళ్లు

గచ్చిబౌలి, వెలుగు: ఓ నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్​ చేపడ్డంతో రాళ్లు ఎగిరి ఓ స్కూల్​పై పడ్డాయి. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. కొండాపూర్​లో నూతనంగా నిర్మాణం చేపడుతున్న సమిశ్రీ నిర్మాణ సంస్థ సెల్లార్ తవ్వకం చేపట్టింది. 

అందులో బండరాళ్లు రావడంతో మంగళవారం మధ్యాహ్నం ఎలాంటి ముందు జాగ్రత్తలు, పర్మిషన్​ లేకుండానే బ్లాస్టింగ్ చేపట్టింది. దీంతో పక్కనే ఉన్న చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ పై రాళ్లు ఎగిరిపడ్డాయి. వాటిని చూసి స్టూడెంట్స్​ పరిగెత్తారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేస్తున్నారు.