న్యూఢిల్లీ: ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ (ఐబీపీఎల్) లో హైదరాబాద్ రాయల్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కేడీ జాదవ్ ఇండోర్ హాల్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై స్మాషర్స్ టీమ్ 5–-1 తేడాతో హైదరాబాద్ రాయల్స్‌ను ఓడించి టైటిల్ నెగ్గింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ వరకు ఒక్క విజయం లేకున్నా నాకౌట్ దశలో వరుస విజయాలు సాధించిన ముంబై టీమ్ ఫైనల్లో అద్భుతంగా ఆడింది.
మెన్స్ సింగిల్స్, డబుల్స్‌లో నెగ్గి ఆరంభంలోనే 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. హైదరాబాద్ తరఫున మేగన్ ఫడ్జ్ విమెన్స్ సింగిల్స్‌లో గెలిచి పోటీలోకి తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ, విమెన్స్ డబుల్స్, నిర్ణయాత్మకమైన గ్రాండ్ ర్యాలీలో ముంబై ఈజీగా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
