కాలం తీరిన వాహనాల నిర్బంధ స్క్రాప్ ప్రతిపాదన లేదు

కాలం తీరిన వాహనాల   నిర్బంధ స్క్రాప్ ప్రతిపాదన లేదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో 15 ఏండ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ చెల్లించి నడుపుకునే వెసులుబాటు ఉందని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రమేశ్​కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.  ఫిట్నెస్ లేని వాహనాలను స్క్రాప్ చేసే ప్రతిపాదన లేదని తెలిపారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్ 189 ప్రకారం ఆర్టీఏ ఆఫీసులోని టెస్టింగ్ స్టేషన్​లో అన్ ఫిట్ అయిన వాహనాలకు నిర్ణీత ఫీజు చెల్లిస్తే మరోసారి టెస్టులకు అవకాశం ఉంటుందన్నారు. అన్ ఫిట్ అయిన వాహనాలను వెంటనే స్క్రాప్ చేసే ప్రతిపాదన మాత్రం లేదని స్పష్టం చేశారు.