హైదరాబాద్లోని స్నో వరల్డ్ లైసెన్స్ రద్దు

హైదరాబాద్లోని స్నో వరల్డ్ లైసెన్స్ రద్దు

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్ లోయర్​ట్యాంక్ బండ్​లోని స్నో వరల్డ్, అదే కాంపౌండ్ లో ఉన్న ఇతర షాపులను రాష్ట్ర టూరిజం అధికారులు గురువారం సీజ్ చేశారు. తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ స్థలాన్ని లీజుకు తీసుకున్న ఓషన్ పార్క్ మల్టీ - టెక్ లిమిటెడ్ అనే సంస్థ 2001 నుంచి స్నో వరల్డ్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏటా చెల్లించాల్సిన లీజ్ డబ్బులు చెల్లించడం లేదు. దాంతో సర్కారుకు చెల్లించాల్సిన బకాయిలు రూ.16.70 కోట్లకు చేరాయి.

బకాయిలు చెల్లించాలని కార్పొరేషన్ అధికారులు ఒత్తిడి చేయడంతో మూడేళ్ల కిందట సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఫిటిషన్ ను విచారించిన కోర్టు.. రెండు నెలల్లో బకాయిలు చెల్లించాలని సంస్థను ఆదేశించింది. గడువు ముగిసినా బకాయిలు చెల్లించకపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు స్నోవరల్డ్ ను సీజ్ చేస్తున్నట్లు టూరిజం కార్పొరేషన్​ ఎండీ బి.మనోహర్​వెల్లడించారు.