పంజాగుట్ట, వెలుగు: సర్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తన అభిమాన క్రికెటర్ వచ్చాడని తెలుసుకున్న భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆయనతో షేక్ హ్యాండ్ చేసేందుకు, ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
