మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌  నంబర్‌‌‌‌ వన్‌

మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌  నంబర్‌‌‌‌ వన్‌

దుబాయ్‌ ‌‌‌: హైదరాబాద్‌‌‌‌ స్టార్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, ఓపెనర్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లను సొంతం చేసుకున్నారు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో సిరాజ్‌‌‌‌ 709 రేటింగ్‌‌‌‌ పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లోకి దూసుకొచ్చాడు. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌‌‌‌ల్లో 10 వికెట్లు తీయడం ఈ హైదరాబాదీ ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది.

జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా (654) మూడు ప్లేస్‌‌‌‌లు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌‌‌‌లో ఉండగా, మహ్మద్‌‌‌‌ షమీ (635) ఏడు స్థానాలు మెరుగుపడి 10వ ర్యాంక్‌‌‌‌లో నిలిచాడు. స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (661) నాలుగో ర్యాంక్‌‌‌‌లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌‌‌‌ చార్ట్‌‌‌‌లో బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (824)ను వెనక్కి నెట్టి గిల్‌‌‌‌ (830) అగ్రస్థానంలోకి వచ్చాడు. కెరీర్‌‌‌‌లో 49వ సెంచరీ చేసిన విరాట్‌‌‌‌ కోహ్లీ (770), రోహిత్‌‌‌‌ శర్మ (739) వరుసగా నాలుగు, ఆరో ర్యాంక్‌‌‌‌లో ఉన్నారు. ఆల్‌‌‌‌రౌండర్స్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో రవీంద్ర జడేజా (225) పదో ర్యాంక్‌‌‌‌లో ఉన్నాడు.