విదేశాల్లో చదివి.. సిటీలో డ్రగ్స్​ దందా .. ముగ్గురు నిందితుల అరెస్ట్

విదేశాల్లో చదివి.. సిటీలో డ్రగ్స్​ దందా .. ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో గత కొంత కాలంగా డ్రగ్స్ దందా చేస్తున్న వారిని ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్​ చేశారు. కూకట్​పల్లికి చెందిన వరుణ్  ప్రభు, చైతన్య అన్నదమ్ములు. లండన్​లో చదువుకున్నారు. విదేశాల్లో నైజీరియన్​తో ఏర్పడ్డ పరిచయాలతో హైదరాబాద్​లో డ్రగ్స్, గంజాయి దందాలోకి దిగారు. ఇటీవల హైదరాబాద్​ వచ్చి తరచూ బెంగళూరు వెళుతూ అక్కడి నుంచి నైజీరియా వ్యక్తుల పరిచయాలతో డ్రగ్స్​ను హైదరాబాద్ కు తెచ్చేవారు. కిరణ్ అనే వ్యక్తితో పాటు మరికొంతమందికి అమ్ముతూ ఉండేవారు. ఈ క్రమంలో కూకట్​పల్లిలోని వివేకానంద కాలనీలో బుధవారం ఎండీఎంఏ  డ్రగ్స్, ఓజీ కుష్ ను ఓ వ్యక్తికి అమ్ముతుండగా..  ఎస్​టీఎఫ్​ సిబ్బందికి సమాచారం అందింది. 

వారిని పట్టుకునేందుకు ఎస్​టీఎఫ్​ ఎస్ఐ​బాలరాజు సంధ్య, సిబ్బందితో వెళ్లారు. వారిని గమనించిన వరుణ్​ప్రభు, చైతన్య తప్పించుకునేందుకు యత్నించారు. అలాగే, ఎస్ఐపై, కానిస్టేబుల్​పై దాడి చేయగా, ఎస్​టీఎఫ్​ టీమ్​ ఆ ముగ్గురిని పట్టుకున్నారు. అలాగే, వారితో సంబంధం ఉన్న వంశీ, సాయికృష్ణ, నందు సాయిపై  కేసు నమోదు చేశారు. వారంతా పరారీలో ఉన్నట్టు ఎస్టీఎఫ్ ఎస్ఐ సంధ్య  తెలిపారు. నిందితుల నుంచి 2.58 ఎండీఎంఏ డ్రగ్స్, 38.56 గ్రాముల ఓజీ కుష్ ను, ఒక బైకు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.