పెళ్లి కాకపోవడంతో యువకుడి ఆత్మహత్య

పెళ్లి కాకపోవడంతో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వెలమ హాస్టల్లో ఉండే బీటెక్ విద్యార్థి దొనకంటి సాయిరాం సూసైడ్కు పాల్పడ్డాడు. 

జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన దొనకంటి సాయిరాం..బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో వెలమ హాస్టల్ లో ఉంటూ..సాఫ్ట్ వేర్ కోర్సులు చేస్తున్నాడు. అయితే ఇతనికి కొద్ది కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ వివాహం సెట్ అవడం లేదు. దీంతో మనస్థాపానికి గురైన  దొనకంటి సాయిరాం..అక్టోబర్ 14వ తేదీన ఎలుకల మందు తాగి సూసైడ్  చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ అక్టోబర్ 15వ తేదీన మరణించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.