హైదరాబాద్, సిటీ వెలుగు : ఎన్‌హెచ్-44 లోని ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ కారిడార్‌కు సంబంధించిన భూ నిర్వాసితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఓ ఆఫీసర్సస్పెన్షన్కు గురయ్యారు.
సంబంధిత సెక్షన్ ఆఫీసర్‌గా ఉన్న అడహక్ తహసీల్దార్ అర్చనను హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక సస్పెండ్ చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జ్యోతిని విచారణాధికారిగా నియమించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
