ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : సీఎం రేవంత్ రెడ్డి

ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ :  సీఎం రేవంత్ రెడ్డి
  • 8 వారాలపాటుపైలెట్ ప్రోగ్రామ్​ అమలు 
  • సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్  ఏఐ సీఈవో కిప్​మన్​ భేటీ

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను దేశంలోనే అత్యంత నివాసయోగ్య సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని  వినియోగించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్​లోని నివాసంలో ఆయనను అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ కలిశారు. 

ఈ సందర్భంగా  ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించే మార్గాలపై డిస్కస్​ చేశారు. ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ ఆధారంగా రియల్‌‌‌‌‌‌‌‌ టైమ్ సెన్సార్ నెట్​వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందని అభిప్రాయపడ్డారు. 

ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీలో ఫిజికల్ ఇంటెలిజెన్స్​ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. 8 వారాల పాటు ఈ ప్రోగ్రామ్​ అమలవుతుంది. ఇందులో భాగంగా సీసీ టీవీ వ్యవస్థను రియల్‌‌‌‌‌‌‌‌ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌గా మారుస్తారు. 

ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవ లన్నీ ఏఐ ఆధారిత అంచనాలతో ఒకేచోట సమన్వ యం చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్​గా దీన్ని మానిటర్ చేస్తారు. ఈ పైలెట్ ప్రోగ్రాం పూర్తయ్యేనాటికి హైదరాబాద్.. దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుందనే అంచనాలున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

ఆర్థిక వృద్ధికి కూడా ఫిజికల్ ఇంటెలిజెన్స్ అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తుందని కిప్​మన్  తెలిపారు.  డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు రావాలని ఆయనను సీఎం ఆహ్వానించారు.