ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్‌బాబు

ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్‌బాబు
  • టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవంలో శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఏరోస్పేస్ గ్లోబల్ సప్లై చైన్‌లో ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేందుకు ఇలాంటి కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జేఈహెచ్ ఏరోస్పేస్ ఏర్పాటు చేసిన ‘టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మంగళవారం ఆయన ప్రారంభించారు.  రాష్ట్రాన్ని అడ్వాన్స్‌ డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, రక్షణ, సాంకేతిక రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులకు, పరిశ్రమలకు కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని మంత్రి తెలిపారు.