దేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవనాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, ఆధునికతకు ఇది ఒక బెంచ్‌మార్క్‌గా మారుతుందని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని, ఇది ఒక ఐకానిక్ భవనంగా నిలుస్తుందన్నారు. న్యాయమూర్తులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఆధునిక వసతులు ఇందులో ఉంటాయని తెలిపారు. న్యాయవ్యవస్థకు ఉత్తమమైన మౌలిక సదుపాయాలు కల్పించడం రాజకీయ కార్యనిర్వాహక వర్గం బాధ్యత అని సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వ చిత్తశుద్ధిని, ప్రజాస్వామ్య విలువలపై తమకున్న అచంచలమైన నమ్మకాన్ని ఈ భవనం చాటి చెబుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లాలు, పట్టణాల్లో 49 కోర్టులు, నివాస గృహాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌కు ఇదొక ‘రెడ్ లెటర్ డే’అని, రాబోయే శతాబ్దం కోసం ఒక అద్భుత కట్టడాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. న్యాయం కోసం ఆశగా ఎదురుచూసే పేదవాడికి ఈ భవనం ఆశాదీపం కావాలన్నారు.
