పర్యాటకులకు గుడ్ న్యూస్.. చార్మినార్ దగ్గర మూడు అంతస్తుల్లో 150 కార్ల పార్కింగ్ బిల్డింగ్

పర్యాటకులకు గుడ్ న్యూస్.. చార్మినార్ దగ్గర మూడు అంతస్తుల్లో 150 కార్ల పార్కింగ్ బిల్డింగ్

హైదరాబాద్: పర్యాటకులకు గుడ్ న్యూస్...ఇకపై చార్మినార్ చూసేందుకు వచ్చే పర్యాటకులకు పార్కింగ్ కష్టాలు  తీరనున్నాయి. కుటుంబ సమేతంగా,  ఫ్రెండ్స్ తో కలిసి చార్ మినార్ వంటి చారిత్రక కట్టడాన్ని చూడాలనకున్న వారికి ఎన్నో ఏళ్లుగా పార్కింగ్ సమస్య వెంటాడుతూ వచ్చింది.. వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం లేక పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇకపై అలాంటి పార్కింగ్ సమస్య ఉండదు. చార్ మినార్ కు నలు వైపుల నుంచి పర్యాటకులకు కోసం మల్లీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 

చార్మినార్ బస్ డిపో సమీపంలో సౌకర్యవంతమైన పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ సౌకర్యం కోసం పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా, DBFOT ఫ్రేమ్‌వర్క్‌పై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) ద్వారా ఈ ప్రాజెక్ట్ స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసక్తిగల పార్టీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 16న బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ను సుమారు 3,493 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు బేస్ మెంట్ స్థాయిల్లో మూడు అంతస్తుల్లో నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంప్లెక్స్ లో దాదాపు 150 ఫోర్ వీలర్ వెహికిల్స్, టూవీలర్ పెయిడ్ పార్కింగ్ స్థలాలు ఉంటాయి. అదనంగా బేస్ మెంట్, గ్రౌండ్ ఫోర్లలో హాకర్లకోసం వాణిజ్య స్థలాలు కేటాయించనున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని పాత నగరం సమగ్ర అభివృద్ధికి ప్రాథమిక ఏజెన్సీగా పనిచేస్తున్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు ఈ MLP కాంప్లెక్స్‌ను PPP మోడల్ ద్వారా నిర్మించాలని నిర్ణయించారు.