హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రెండు రోజులు ..జీఐఏ గోల్ఫ్‌‌‌‌‌‌‌‌–టర్ఫ్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  రెండు రోజులు ..జీఐఏ గోల్ఫ్‌‌‌‌‌‌‌‌–టర్ఫ్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (జీఐఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 12వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ గోల్ఫ్-– టర్ఫ్ సమ్మిట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. సౌత్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో తొలిసారి నిర్వహిస్తున్న  ఈ సమ్మిట్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్– కంట్రీ క్లబ్‌‌‌‌‌‌‌‌లో గురు, శుక్రవారాల్లో  జరగనుంది. 

ఈ సమ్మిట్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌పో  గోల్ఫ్, టర్ఫ్ నిర్వహణ, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఆటతో పాటు, హైదరాబాద్ నగర అభివృద్ధి, టూరిజం రంగంలో గోల్ఫ్ పాత్రను బలోపేతం చేయడం దీని  ప్రధాన లక్ష్యమని ఆర్గనైజర్లు తెలిపారు. గోల్ఫ్‌‌‌‌‌‌‌‌ను ఆర్థికాభివృద్ధికి, రియల్ ఎస్టేట్ కొత్త మార్పులకు,  ఉద్యోగ అవకాశాలకు ఒక సాధనంగా మార్చాలని జీఐఏ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుందని వెల్లడించారు.