17 నుంచి ఏఐ భారత్ మహోత్సవం

 17 నుంచి ఏఐ భారత్ మహోత్సవం

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఈ నెల 17 నుంచి మూడు రోజులపాటు ఏఐ భారత్ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు డాక్టర్ సి.వి.మహేశ్​కుమార్ తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 17న హైదరాబాద్  కేంద్రీయ విశ్వవిద్యాలయం,18న డ్రాప్ అవుట్ స్టార్టప్ కేంద్రం, గచ్చి బౌలి,19న మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్​రెడ్డి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఫ్యూచురా ఎండీ డెరిక్ జోన్, మహిళా క్రికెటర్ అనుషా రెడ్డి  హాజరవుతాయని చెప్పారు. 

పెంటాగ్రామ్ చైర్మన్ డాక్టర్ ఇ.జి.రాజన్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ ఏవిధంగా ఉపయోగపడుతుందో అవగాహన కలిగించడమే లక్ష్యంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా పాల్గొవచ్చని, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జీఏఏఐ.బీఐజెడ్ వెబ్ సైట్ లో  పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం టాగిల్ నౌ సీఈవో రఘు బొడ్డు, సీఎంఆర్ గ్రూప్ ఇన్​స్టిట్యూట్స్ వైస్ చైర్మన్ అభినవ్ చామకూర తదితరులతో కలిసి పోస్టర్​పోస్టర్​ఆవిష్కరించారు.