21 నుంచి హైదరాబాద్​లో ఇంటర్నేషనల్ చెస్​

21 నుంచి హైదరాబాద్​లో ఇంటర్నేషనల్ చెస్​


హైదరాబాద్‌‌, వెలుగు:  ఫిడే రేటింగ్‌‌తో కూడిన ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్‌‌ టోర్నమెంట్‌‌ తొలిసారి హైదరాబాద్​లో జరగనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు యూసుఫ్‌‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌‌ రెడ్డి ఇండోర్‌‌ స్టేడియంలో తెలంగాణ స్టేట్​ చెస్​ అసోసియేషన్​తో కలిసి ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్టు స్లాన్‌‌ స్పోర్ట్స్‌‌ ప్రకటించింది. ఈ టోర్నీకి సంబంధించిన బ్రోచర్​ను శాట్స్​ చైర్మన్​ ఆంజనేయ గౌడ్‌‌  ఆవిష్కరించారు. వివిధ​ దేశాల నుంచి 500 పైచిలుకు ప్లేయర్లు ఈ టోర్నీకి హాజరయ్యే అవకాశం ఉందని స్లాన్‌‌ స్పోర్ట్స్‌‌ ఫౌండర్‌‌ ఎస్‌‌పీవీఎం సుబ్రమణ్యం తెలిపారు. ఓవరాల్‌‌గా రూ.10 లక్షల ప్రైజ్​మనీ ఉన్న ఈ టోర్నీలో విన్నర్​కు రూ. లక్ష నగదు లభిస్తుందని స్లాన్‌‌ స్పోర్ట్స్​ సీఓఓ నవీన్‌‌ వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల కోసం 9885979740 నంబర్‌‌ను సంప్రదించాలని సూచించారు.