హైదరాబాద్‌లో గ్లాండ్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌లో గ్లాండ్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్ త్వరలోనే అంతర్జాతీయ ఫార్మా హబ్‌గా మారనుంది. ప్రముఖ గ్లాండ్ ఫార్మా  జినోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇదే గనక పూర్తయితే 500కు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. బయోలాజికల్, బయోసిమిలర్, యాంటీబాజీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్ వంటి అధునాతన రంగాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో దాదాపు వెయ్యి మిలియన్ యూనిట్ల పూర్తి ఫార్ములేషన్ సామర్థ్యంతో 8 తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడులపై మంత్రి కేటీఆర్ కూడా ఇటీవల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. లైఫ్ సైన్సెస్, దాని అనుబంధ రంగాలలో ప్రస్తుతం సుమారు నాలుగు లక్షల మంది పనిచేస్తుండగా.. ఇది వచ్చే ఐదేళ్లలో 8 లక్షలతో రెట్టింపు స్థాయికి చేరనుందని పేర్కొన్నారు.