హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగం భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా మొత్తం రూ. 1,172.08 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మొత్తం 17,957 అనుమతులు మంజూరు చేయగా, ఇందులో సీఎంసీ రూ. 538.09 కోట్లు, జీహెచ్‌ఎంసీ రూ. 436.47 కోట్లు, ఎంఎంసీ రూ. 198.24 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.
అనుమతుల సంఖ్య పరంగా ఎంఎంసీ 6,799 దరఖాస్తులతో ముందంజలో ఉండగా, జీహెచ్‌ఎంసీ 5,755, సీఎంసీ 5,403 అనుమతులు ఇచ్చాయి. వివిధ కేటగిరీల కింద పరిశీలిస్తే ఇన్స్టంట్ అప్రూవల్ ద్వారా 12,014 భవనాలకు, ఇన్ స్టంట్ రిజిస్ట్రేషన్ కింద 972 భవనాలకు, సింగిల్ విండో విధానంలో 2,515 నిర్మాణాలకు అనుమతులు లభించాయి. వీటితో పాటు 29 లేఅవుట్/హౌసింగ్ ప్లాట్లకు అనుమతులివ్వగా, మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 2,427 ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేశారు.
