హైదరాబాద్లో మరో వన్ వే.. ఛే నంబర్ టు తిలక్ నగర్.. ఎప్పటి వరకు అంటే..

హైదరాబాద్లో మరో వన్ వే.. ఛే నంబర్ టు తిలక్ నగర్..  ఎప్పటి వరకు అంటే..
  •      నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు.. 
  •      హైడ్రా పనుల నేపథ్యంలో నిర్ణయం 

హైదరాబాద్ సిటీ, వెలుగు :  హైడ్రా అభివృద్ధి పనుల దృష్ట్యా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఛే నంబర్​జంక్షన్ నుంచి తిలక్ నగర్ వరకు ఉన్న రూట్​లో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్ వెల్లడించారు. ఛే నంబర్​జంక్షన్ నుంచి తిలక్ నగర్ వైపు వన్​వే ఉంటుందని తెలిపారు. 

తిలక్ నగర్ నుంచి ఛే నంబర్​జంక్షన్ వైపు వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఇందులో భాగంగా ఎన్​సీసీ నుంచి అంబర్​పేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు తిలక్ నగర్ కుడివైపు తీసుకుని,  ఫీవర్ హాస్పిటల్,​- బర్కత్‌‌‌‌‌‌‌‌పురా చమన్,  టూరిస్ట్ హోటల్, నింబోలిఅడ్డా,- గోల్నాక , ఛే నంబర్​మీదుగా వెళ్లాలి. విద్యానగర్ నుండి ఫీవర్ హాస్పిటల్​మీదుగా అంబర్‌‌‌‌‌‌‌‌పేట వైపు వెళ్లాలంటే త్యాగరాయ గానసభ / టీ.వై. మండలి ,  బర్కత్‌‌‌‌‌‌‌‌పురా చమన్, - టూరిస్ట్ హోటల్,  నింబోలిఅడ్డా, గోల్నాక, ఛే నంబర్​ మీదుగా చేరుకోవాలి. ఇదొక్కటే కాకుండా ఆల్టర్నేట్​రూట్​కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఛే నంబర్ జంక్షన్ నుంచి తిలక్ నగర్ వైపు భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు వెళ్లలేకపోతే గోల్నాక నుంచి  నింబోలి అడ్డా మీదుగా మళ్లిస్తారు. భారీ వాహనాలు మినహా ఫీవర్ హాస్పిటల్, ​ఎన్​సీసీ వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు తిలక్ నగర్ నుంచి బడా గణేశ్​ లైన్, బతుకమ్మ కుంట రోడ్డు వైపు మళ్లిస్తారు. ఇది వన్​వే గా ఉంటుంది.