హైదరాబాద్ : గోల్కొండ బోనాలు.. జులై 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : గోల్కొండ బోనాలు.. జులై 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
  • హెల్ప్​లైన్​ నంబర్ ​ఏర్పాటు 
  • రద్దీగా ఉండే రూట్లను అవాయిడ్​ చేయాలి
  • సిటీ ట్రాఫిక్ ​జాయింట్ ​కమిషనర్ ​జోయల్ ​డేవిస్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: గోల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా గురువారం నుంచి జులై 24 వరకు ట్రాఫిక్ ​ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ​ట్రాఫిక్​ జాయింట్​కమిషనర్​ జోయల్​ డేవిస్​ తెలిపారు. ప్రత్యేక పార్కింగ్ జోన్లు, హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. 

గోల్కొండ కోటకు వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, దీన్ని గమనించి వాహనదారులు ప్లాన్​ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రాందేవ్ గూడ నుంచి మక్కా దర్వాజ మీదుగా గోల్కొండ వెళ్లే దారి, ఫతే దర్వాజా మీదుగా లంగర్ హౌజ్ ​నుంచి గోల్కొండ కోటకు వెళ్లే మార్గం, బంజారా దర్వాజా ద్వారా గోల్కొండ కోటకు  వెళ్లే 7 టూంబ్స్ రోడ్డు, అలాగే షేక్​పేట నాలా దారి రద్దీగా ఉంటాయన్నారు. 

ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనదారులు ఈ  రూట్లను అవాయిడ్ చేయడం మంచిదని సూచించారు.  ట్రాఫిక్ జామ్‌‌‌‌ సమస్యలు తలెత్తితే  90102 03626  హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు కాల్​చేయాలని, సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్  ఎక్స్​ద్వారా ట్రాఫిక్ అప్​డేట్స్​ఇస్తామన్నారు.  

పార్కింగ్ జోన్లు ఇవే..

  • రాందేవ్ గూడ నుంచి మక్కా దర్వాజ మీదుగా వచ్చే వాహనదారుల కోసం అషూర్ ఖానా, ఆర్మీ సెంట్రీ పోస్ట్, రాందేవ్ గూడ, గోల్కొండ ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సెట్విన్ బస్సులను అషూర్ ఖానా పార్కింగ్ వరకు మాత్రమే అనుమతిస్తారు.
  • ఫతే దర్వాజా మీదుగా లంగర్ హౌజ్ నుంచి వచ్చే భక్తులకు ఎంసీహెచ్​పార్క్, ఫతే దర్వాజా, గోల్కొండ బస్ స్టాప్,  అల్హీరా స్కూల్, ఏరియా హాస్పిటల్, గోల్కొండ ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 
  • షేక్‌‌‌‌పేట్ నుంచి బంజారా దర్వాజా మీదుగా వచ్చే భక్తులకు గోల్ఫ్ క్లబ్ రోడ్ బై-లేన్, హాకీ గ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్,  డెక్కన్ పార్క్, సెవెన్ టూంబ్స్ ఏరియాల్లో పార్కింగ్ ఉంటుంది.