హైదరాబాద్లో సాయంత్రం 6 తర్వాత ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కున్నట్టే..!

హైదరాబాద్లో సాయంత్రం 6 తర్వాత ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కున్నట్టే..!

హైదరాబాద్: హైదరాబాద్లోని రాజ్ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. దీంతో.. ఆగస్ట్ 15న సాయంత్రం 6 గంటల నుంచి రాజ్ భవన్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

రాజ్ భవన్ రోడ్ వైపునకు వెళ్లే వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలు రాకపోకలు సాగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌‌‌‌లో వేడుకల జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామ్‌‌‌‌దేవ్‌‌‌‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు రోడ్లు మూసివేశారు. గోల్ఫ్ క్లబ్ లేన్ సమీపంలోని సెవెన్​టూంబ్స్​నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే ట్రాఫిక్ ను జమాలీ దర్వాజా వైపు మళ్లించారు. అలాగే  గోల్కొండ బస్ స్టాప్ దగ్గరున్న జీహెచ్ఎంసీ గ్రౌండ్, ఐలాండ్ నుంచి వచ్చే ట్రాఫిక్ను మోతీ మహల్ క్రాస్ రోడ్ వైపు పంపించారు. తవక్కల్​స్టోర్, బడా బజార్ నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే ట్రాఫిక్ ను జీహెచ్​ఎంసీ ఐలాండ్ వైపు తరలించారు. ఇబ్రహీం మెడికల్ హాల్ చోటా బజార్ నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాలు మోతీ దర్వాజా వైపు వెళ్లాలి. రామ్‌‌‌‌దేవ్‌‌‌‌గూడ టీ" జంక్షన్, నార్సింగి, టిప్పు ఖాన్ బ్రిడ్జ్ నుంచి కోట వైపు వచ్చే ట్రాఫిక్ రామ్‌‌‌‌దేవ్‌‌‌‌గూడ జంక్షన్ వద్ద మళ్లించారు.