రాములోరి శోభాయాత్ర.. ఇయ్యాల (మార్చి27) ట్రాఫిక్ ఆంక్షలు

రాములోరి శోభాయాత్ర..  ఇయ్యాల (మార్చి27) ట్రాఫిక్ ఆంక్షలు

 

  • చాలా ప్రాంతాల్లో  వాహనాల దారి మళ్లింపు  
  • రద్దీగా ఉండే ఏరియాల లిస్ట్​ విడుదల 
  • ఆల్టర్నేట్ రూట్స్​ ​​చూసుకోవాలని పోలీసుల సూచన

బషీర్​బాగ్, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా నగరంలో ఇవాళ నిర్వహించనున్న భారీ శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్స్​విధించారు. యాత్ర సాగే మార్గాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెయిన్​చౌరస్తాల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు యాత్ర కొనసాగే పలు ప్రాంతాల్లో వాహనదారులు ఆల్టర్నేట్​మార్గాలు చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాతబస్తీ, అబిడ్స్, నాంపల్లి, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. 

ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. 

సీతారాంబాగ్ ఆలయం: ఆసిఫ్ నగర్ నుంచి బోయిగూడ కమాన్ వైపు వచ్చే ట్రాఫిక్ ను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద విజయ్ నగర్ కాలనీ, నాంపల్లి , మెహదీపట్నం వైపు మళ్లిస్తారు 

ఫ్రెండ్స్ కేఫ్: అఘాపురా , బోయిగూడ కమాన్ బై-లేన్ల నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్ వద్ద అఘాపురా , హబీబ్ నగర్ వైపు డైవర్ట్​ చేస్తారు.  

బోయిగూడ కమాన్: దారుస్సలాం నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలను అఘాపురా ఎక్స్ రోడ్స్ వద్ద ఘోడే- కీ -ఖబర్ లేదా కొత్త అఘాపురా, చార్‌‌‌‌ కందిల్ ఎక్స్ రోడ్, నాంపల్లి వైపు మళ్లిస్తారు. 

బోయిగూడ కమాన్ కుడి మలుపు: శోభాయాత్ర బోయిగూడ కమాన్ వద్ద మంగళ్‌‌‌‌హాట్ మార్కెట్ వైపు కుడి మలుపు తీసుకున్నప్పుడు, గాంధీ విగ్రహం నుంచి మంగళ్ హాట్ వైపు వచ్చే ట్రాఫిక్ ఘోడే -కీ -ఖబర్ వద్ద టక్కర్‌‌‌‌వాడీ జంక్షన్ లేదా కొత్త అఘాపురా వైపు డైవర్ట్​చేస్తారు.  

జాలీ హనుమాన్ ఆలయం: పురాణాపూల్ , జుమ్మేరాత్​బజార్​నుంచి మంగళ్‌‌‌‌హాట్ వైపు వచ్చే వాహనాలను గాంధీ విగ్రహం వద్ద టక్కర్‌‌‌‌వాడీ జంక్షన్ లేదా ఘోడే- కీ-ఖబర్/పురానాపూల్ వైపు పంపిస్తారు.  

రహీంపురా: పురాణాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే వెహికల్స్​ను పురాణాపూల్ ఎక్స్ రోడ్స్ వద్ద పురాణాపూల్ దర్వాజా, కార్వాన్, కుల్సుంపురా, 100 ఫీట్ రోడ్డు వైపు మళ్లిస్తారు. 

గాంధీ విగ్రహం: ఎంజే బ్రిడ్జి నుంచి టక్కర్‌‌‌‌వాడీ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను ఆఘాపురా , ఘోడే -కీ -ఖబర్ వైపు మళ్లిస్తారు. ఎంజే బ్రిడ్జి నుంచి అఫ్జల్‌‌‌‌గంజ్/సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలు జుమ్మేరాత్​బజార్​రోడ్డు మీదుగా తరలిస్తారు.  

టక్కర్‌‌‌‌వాడీ జంక్షన్: బేగంబజార్ ఛత్రీ నుంచి వచ్చే ట్రాఫిక్ రాణి అవంతీ బాయి విగ్రహం వద్ద ఎంజే బ్రిడ్జ్ వైపు పంపిస్తారు.  

రాణి అవంతీ బాయి విగ్రహం (జుమ్మేరాత్​బజార్): బేగంబజార్ బై-లేన్ల నుంచి గాంధీ విగ్రహం/పురాణాపూల్ వైపు వచ్చే ట్రాఫిక్ ను లేబర్ అడ్డా వద్ద అలాస్కా టీ -జంక్షన్ వైపు డైవర్ట్​చేస్తారు.  

 బేగంబజార్ ఛత్రీ: మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను అలాస్కా టీ -జంక్షన్ వద్ద దారుస్సలాం/మాలకుంట వైపు మళ్లిస్తారు. రంగచారి లేన్, అఫ్జల్‌‌‌‌గంజ్ నుంచి బేగంబజార్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ఎస్​ఏ బజార్ (శ్రీకృష్ణ జ్యువెల్లరీ వద్ద) నుంచి ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. 

 బర్తన్ బజార్: అఫ్జల్‌‌‌‌గంజ్ బై-లేన్ల నుంచి ఎస్​ఏ బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ఎస్​ఏ బజార్ యూ టర్న్​వద్ద అఫ్జల్‌‌‌‌గంజ్ సాలార్‌‌‌‌జంగ్ బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు. 

ఎస్​ఏ బజార్: అజంతా గేట్ , జాంబాగ్‌‌‌‌ల నుంచి ఎస్​ఏ బజార్ వైపు వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద పుత్లీబౌలి, రంగమహల్ వైపు టర్న్​చేస్తారు.  

 ఎస్​ఏ బజార్ మసీదు: నయాపూల్ నుంచి ఎస్ఏ బజార్ మసీదు వైపు వచ్చే వెహికల్స్​ను అఫ్జల్‌‌‌‌గంజ్ టీ -జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ – శివాజీ బ్రిడ్జ్ – సీబీఎస్​వైపు మళ్లిస్తారు. 

ఎంజే మార్కెట్: నాంపల్లి , అబిడ్స్ నుంచి ఎస్​ఏ బజార్ మసీదు వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద జాంబాగ్, పుట్లిబౌలి , రంగమహల్ వైపు డైవర్ట్​చేస్తారు.  

అబిడ్స్ జీపీవో : అబిడ్స్ రోడ్డు నుంచి ఎంజే మార్కెట్ వైపు వచ్చే వాహనాలను బ్యాంక్ స్ట్రీట్, ఆంధ్రా బ్యాంక్ రోడ్డు వైపు మళ్లిస్తారు. (యాత్ర శంకర్ షేర్ హోటల్ చేరుకోగానే ఈ మళ్లింపు ఉంటుంది)  

 ఎస్​ఏ బజార్/గౌలిగూడ చమన్: పుట్లిబౌలి నుంచి శంకర్ షేర్ హోటల్ వైపు వచ్చే ట్రాఫిక్ గౌలిగూడ చమన్ వద్ద త్రివేణి లాడ్జ్ , సీబీఎస్​వైపు మళ్లిస్తారు. 

శంకర్ షేర్ హోటల్: రంగమహల్ నుంచి గౌలిగూడ చమన్ వైపు వచ్చే ట్రాఫిక్ పుట్లిబౌలి ఎక్స్ రోడ్స్ వద్ద జాంబాగ్ , ఎంజే మార్కెట్ వైపు డైవర్ట్​చేస్తారు. ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చే వాహనాలను కూడా ఇదే విధంగా మళ్లిస్తారు. 

రామ్ మందిర్ కమాన్: చాదర్‌‌‌‌ఘాట్ ఎక్స్ రోడ్​నుంచి పుట్లిబౌలి/జాంబాగ్ వైపు వచ్చే వెహికల్స్​రంగమహల్ వై జంక్షన్ వద్ద సీబీఎస్ , అఫ్జల్‌‌‌‌గంజ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.  

రామ్ మందిర్ కమాన్ (అబిడ్స్ నుంచి): జీపీవో అబిడ్స్​నుంచి పుట్లిబౌలి ఎక్స్ రోడ్ వైపు వచ్చే వాహనాలు ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వద్ద డీఎంహెచ్ఎస్​ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి. అబిడ్స్ రోడ్డు నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాలను జీపీవో వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.

పుత్లీబౌలి ఎక్స్ రోడ్: ఎంజే మార్కెట్ నుంచి ట్రూప్ బజార్/బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వా హనాలు యూసుఫ్ అండ్ కంపెనీ వద్ద జీపీవో, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.  

పుత్లీబౌలి ఎక్స్ రోడ్ (చాదర్‌‌‌‌ఘాట్ నుంచి): చాదర్‌‌‌‌ఘాట్ నుంచి ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ డీఎంహెచ్ఎస్​ఎక్స్ రోడ్ వద్ద సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను చాదర్‌‌‌‌ఘాట్ వైపు డైవర్ట్​ చేస్తారు.  

ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్: చాదర్‌‌‌‌ఘాట్ ఎక్స్ రోడ్ నుంచి డీఎంహెచ్​ఎస్​ఎక్స్ రోడ్ వైపు వచ్చే వాహనాలు చాదర్‌‌‌‌ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద నింబోలిఅడ్డ – కాచిగూడ ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి.  

ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ (నారాయణగూడ నుంచి): నారాయణగూడ నుంచి బడీచౌడి వైపు వచ్చే వాహనాలు కాచిగూడ ఎక్స్ రోడ్ వద్ద కాచిగూడ స్టేషన్ రోడ్డు వైపు మళ్లాలి. అబిడ్స్ నుంచి ఆంధ్ర బ్యాంక్ వైపు వచ్చే ట్రాఫిక్ జీపీవో వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.  

సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ : బాటా రోడ్ – కింగ్ కోఠి – రాంకోఠి ఎక్స్ రోడ్ నుంచి ప్రగతి టిఫిన్ సెంటర్ వైపు వచ్చే ట్రాఫిక్ ను బొగ్గులకుంట ఎక్స్ రోడ్ వద్ద మళ్లిస్తారు. 

రద్దీగా ఉండే ప్రాంతాలివే..

బేగంబజార్ ఛత్రీ, ఎస్​ఏ బజార్, అఫ్జల్‌‌‌‌గంజ్ టీ -జంక్షన్, శివాజీ బ్రిడ్జి, సీబీఎస్, రంగమహల్ వై -జంక్షన్, పుట్లిబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్, అబిడ్స్ జీపీవో, ఎంజే మార్కెట్, చాదర్‌‌‌‌ఘాట్, కాచిగూడ ఎక్స్ రోడ్, నింబోలిఅడ్డ.

వైన్​ షాపులు బంద్​ 

సిటీ నెట్​వర్క్, వెలుగు  : శ్రీ రామనవమి సందర్భంగా హైదరాబాద్​, సైబరాబాద్​, మల్కాజిగిరి, ఫ్యూచర్​సిటీ పోలీస్​కమిషనరేట్ల పరిధిలో వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, మిలిటరీ క్యాంటీన్లు శుక్రవారం మూసివేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీలు సజ్జనార్, రమేశ్, సుధీర్​బాబు, అవినాశ్​మహంతి తెలిపారు. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులకు ఈ రూల్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.