IPL : మిడిలార్డర్ రాణిస్తే రైజింగే..

IPL : మిడిలార్డర్ రాణిస్తే రైజింగే..

హైదరాబాద్‌ : IPL సీజన్-12 సగానికి చేరింది. అయినా.. ఈసారి సన్ రైజర్స్ ఇంకా రైజింగ్ కావడంలేదు. ప్లే ఆఫ్ ఆశలు దక్కించు కోవాలంటే ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకోవాలి. ఆడిన 7 మ్యాచుల్లో 3 గెలిచిన SRH టీమ్.. స్టార్టింగ్ లో మంచి జోరు చూపించింది. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడుతూ వస్తోంది. సన్ రైజర్స్ బలం బౌలింగే. కనీస స్కోర్ చేసినా… బౌలింగ్ బలంతో గెలవడం సన్ రైజర్స్ కు బాగా తెలుసు. ఐతే.. బ్యాటింగ్ లో బలహీనతలు ఆ జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. ఓపెనర్లు త్వరగా ఔట్ అయితే సన్ రైజర్స్ టీమ్ సంగతి అంతే. మిడిలార్డర్ ఏమాత్రం రాణించలేకపోతోంది. లోయర్ ఆర్డర్ హిట్టర్లయిన భువనేశ్వర్, రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్లు గతంలోలాగా పర్ఫార్మెన్స్ చూపించలేక పోతున్నారు. వీరు కుదురుకుంటే సిక్సర్ల మోత మోగాల్సిందే. ముఖ్యంగా మిడిలార్డర్ లో షకీబ్ ఉల్ ఆసన్, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్ లను టీమ్ లోకి తీసుకుంటే బలంగా ఉంటుందంటున్నారు స్పోర్ట్స్ ఎనలిస్టులు.

ఉప్పల్ వేదికగా బుధవారం రాత్రి 8 గంటలకు చెన్నైతో తలపడనుంది హైదరాబాద్. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న ధోనీ సేన అంటేనే మిగతా టీమ్స్ కు వణుకు. అలాంటిది మరి ఇవాళ్టి మ్యాచ్ లో హైదరాబాద్ ఎలా రాణిస్తుందో చూడాలి. ఆల్ ద బెస్ట్ హైదరాబాద్.