హైదరాబాద్లో వణికిస్తున్న చలి

హైదరాబాద్లో వణికిస్తున్న చలి

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తర, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండి చలి తీవ్రత పెరిగిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 8.5 డిగ్రీలు నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 9.7, నిర్మల్ లో 10.3, మంచిర్యాలలో 10.5, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 10, మెదక్ జిల్లా టెక్మాల్ లో 10.4 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యింది. 

మరోవైపు హైదరాబాద్లో చలి వణికిస్తోంది. GHMC శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ఉదయం పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.