
హైదరాబాద్ లోని పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్ ,బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ,లింగంపల్లి, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, నిజాంపేట, పటాన్ చెరు,అమీర్ పేట,పంజాగుట్ట, బేగంపేట, యూసఫ్ గూడ్, బోరబండ, ఖైరతాబాద్, లక్డీకపూల్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, ఈసీఐఎల్ లో వర్షం పడుతోంది.
పలు కాలనీలు వర్షానికి జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో వర్షం పడుతోంది. మరో మూడురోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.