
గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ కోసం రూ.23వేల కోట్లతో 111 కిలోమీటర్లలో 54 జంక్షన్లు, ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేలు నిర్మించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. మరో 166 కిలోమీటర్ల విస్తీర్ణంలో మేజర్ కారిడార్ల నిర్మాణం, 348 కిలోమీటర్ల మేజర్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు . వీటిలో ఇప్పటికే రూ.2,988.64 కోట్ల తో పలు ఏరియాల్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి , బయోడైవర్సిటీ జంక్షన్ వంతెన పనులను ఈ మధ్యే పరిశీలించారు. ఆ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసి మార్చిలో ప్రారంభించనున్నామన్నారు.
ఇప్పటికే రూ. 65.82 కోట్లతో చేపట్టిన రాజీవ్ గాంధీ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్ నెం.-45 ఎలివేటర్ కారిడార్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో, రూ.333.55 కోట్ల తో చేపట్టి న షేక్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్, రూ.263 కోట్లతో చేపట్టిన కొత్తగూడ గ్రేడ్ సపరేటర్ వంతెనలను డిసెంబర్‌లో పూర్తిచేస్తామని తెలిపారు. ఒవైసీ హాస్పిటల్ నుంచి బహుదూర్‌పుర మార్గంలో రూ. 132 కోట్ల తో చేపట్టిన కారిడార్ నిర్మాణాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో, అంబర్‌పేట్ చే నెంబర్‌లో రూ. 270 కోట్ల తో చేపట్టిన ఫ్లై ఓవర్‌ను డిసెంబర్‌లో పూర్తి చేయడానికి పనుల్లో వేగం పెంచామని పేర్కొన్నారు మేయర్ బొంతు రామ్మోహన్.