హైదరాబాద్దే బుచ్చిబాబు ట్రోఫీ.. తమిళనాడు ఎలెవన్పై తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంతో గెలుపు

హైదరాబాద్దే బుచ్చిబాబు ట్రోఫీ.. తమిళనాడు ఎలెవన్పై  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంతో గెలుపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆలిండియా  బుబ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్ నిలబెట్టుకుంది.  ఇండియా డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభానికి ముందు ప్రతీ ఏటా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ) నిర్వహించే టోర్నీలో వరుసగా రెండోసారి చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. 

హైదరాబాద్, ఆతిథ్య తమిళనాడు ప్రెసిడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్ల మధ్య చెన్నైలో మంగళవారం (సెప్టెంబర్ 09) ముగిసిన ఫైనల్ డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం ఆధారంగా హైదరాబాద్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్.. 376 స్కోరు చేయగా.. ప్రతీగా తమిళనాడు  353 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

23 రన్స్ ఆధిక్యంతో  రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన హైదరాబాద్ మ్యాచ్ చివరకు 70 ఓవర్లలో 155/5 స్కోరు చేసింది. వరుణ్ గౌడ్ (56 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫిఫ్టీతో రాణించాడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రోఫీతో పాటు రూ. 3 లక్షల ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ లభించింది.  టోర్నీలో అత్యధికంగా 494 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆరు వికెట్లు తీసిన  హైదరాబాద్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుణ్ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది.