ఒలింపిక్స్ కల నెరవేరుస్తా: హైదరాబాదీ గ్రాండ్ మాస్టర్

ఒలింపిక్స్ కల నెరవేరుస్తా: హైదరాబాదీ గ్రాండ్ మాస్టర్
  • గ్రాండ్‌ మాస్టర్‌ జయంత్‌ రెడ్డి
  • సర్కారు స్థలమిస్తే అకాడమీ ఏర్పాటు చేస్తా
  • క్రీడా ఔత్సాహికులకు ఉచిత శిక్షణ
  • 52 ప్రపంచ రికార్డులు,28 గిన్నిస్‌ రికార్డులు సొంతం

పట్టుదల, దీక్ష, అంకితభావం, దృఢ సంకల్పంతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీలేదని హైదరాబాద్‌‌‌‌కు చెందిన మార్షల్​ ఆర్ట్స్​ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ జయంత్‌‌‌‌ రెడ్డి నిరూపించారు. తైక్వాండో మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌లో ఆయనకు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఎన్నో పతకాలు, సన్మానాలు, సత్కారాలు వరించాయి. ఏకంగా 28 గిన్నిస్‌‌‌‌ రికార్డులు,  తైక్వాండోలో మరో 24 అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారు. సర్కారు స్థలం కేటాయిస్తే అకాడమీ ఏర్పాటు చేసి ఒలింపిక్స్​ కల నెరవేరుస్తానని చెబుతున్నారు.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మన దేశంలోనే కాకుండా అమెరికా, ఇంగ్లండ్‌‌‌‌, కొరియా వంటి దేశాల్లోనూ మన దేశం తరఫున పాల్గొని జయంత్​రెడ్డి సత్తా చాటారు. అమెరికాలోని మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌‌‌‌డీ చేసి డాక్టరేట్‌‌‌‌ పట్టా సాధించారు. నెదర్లాండ్‌‌‌‌ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌ గ్రాడ్యుయేషన్‌‌‌‌ పూర్తి చేశారు. 1988లో ముంబయిలో ఆక్యుప్రెషర్‌‌‌‌, మ్యాగ్నటిక్‌‌‌‌ థెరపీలో డిప్లొమా చేశారు. ప్రాణిక్‌‌‌‌ హీలింగ్‌‌‌‌, హిప్నాసిస్‌‌‌‌, మెడిటేషన్‌‌‌‌ తదితర అంశాల్లో ఆయన ప్రతిభ కనబర్చారు. మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌లో 8వ డాన్‌‌‌‌ వరకు పూర్తి చేశారు. మొత్తం 52 అంతర్జాతీయ స్థాయి రికార్డులు సాధించగా వాటిలో 28 గిన్నిస్‌‌‌‌ రికార్డులున్నాయి. తైక్వాండోలో పంచెస్‌‌‌‌, కిక్స్‌‌‌‌, బ్రేకింగ్స్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ తదితర విభాగాల్లో సత్తా చాటి రికార్డులు సొంతం చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా జయంత్​రెడ్డి తీర్చిదిద్దారు. ఒలిం పిక్స్‌‌‌‌లో పాల్గొని పతకం సాధించాలనే ఆ యన కోరిక వివిధ కారణాల వల్ల నెరవేరలేదు.

ఒలింపిక్స్​ కల నేరవేరేలా

ఒలింపిక్స్​ కల నెరవేరేలా తన శిష్యులను తీర్చిదిద్దాలని శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎందరికో తర్పీదు ఇచ్చానని, అమెరికాలో జరిగిన మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ పోటీల్లో తన శిష్యులు 36 ప్రపంచ రికార్డులు సాధించినట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి సహకారం కావాలని, నగరంలో స్థలం కెటాయిస్తే అకాడమీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. మన పూర్వీకులు బ్రీతింగ్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌‌‌, ఫిజికల్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌ సైజ్‌‌‌‌ ఎలా చేసేవారు, ధ్యానం ఏలా చేసేవారు ఇలాంటివన్నీ పరిశీలించి మార్షల్‌‌‌‌ యోగా తయారు చేశానని వివరించారు. దీన్ని తన శిష్యులకు నేర్పించి గుర్తింపు తీసుకొస్తున్నానని చెప్పారు. మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌కు సంబంధించి ఇప్పటివరకు రెండు పుస్తకాలు రాశానన్నారు. వరల్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌, సీక్రెట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ లాంగ్‌‌‌‌టివిటీ అనే పేర్లతో పుస్తకాలు రాసినట్లు వెల్లడించారు. ఈ రెండు పుస్తకాలను జూలైలో విడుదల చేయనున్నట్లు వివరించారు.

ఇప్పటికీ తను ప్రతిరోజూ సాధన చేస్తానని, ఉదయం 2గంటలు సాధన కోసం కేటాయిస్తానన్నారు. తన శిష్యులను ప్రతి 3 నెలలకోసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లి పతకాలు సాధించి తీసుకొస్తున్నానని చెప్పారు. మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌లో ఆసక్తి ఉన్న వారికి ఉచితంగానే శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. తనకు ఒలింపిక్స్‌‌‌‌లో పాల్గొనే అవకాశం రాలేదు కాబట్టి, తన శిష్యులు సుమారు పది, పదిహేను మందిని ఒలింపిక్స్‌‌‌‌లో పాల్గొనేలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎప్పటికైనా వరల్డ్‌‌‌‌ స్పీడ్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ ఏర్పాటు చేయాలనేది తన కల అని చెబుతున్నారు. దీని గురించి తను రూపొందించిన వరల్డ్‌‌‌‌ స్పీడ్‌‌‌‌ మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ను ఒలింపిక్స్‌‌‌‌లో ప్రవేశపెట్టాలని లేఖ రాసే యోచనలో ఉన్నారు.

ప్రపంచ చాంపియన్లుగా ఎదగాలని ఎంతోమంది కలలు కంటున్నారుని, అలాంటి వారికి తర్పీదునిచ్చి దేశానికి పతకాలు సాధించాలనే ఆలోచనతో ఉన్నారు. త్వరలో ఔత్సాహిక క్రీడాకారుల కోసం ఓ రెసిడెన్షియల్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ కోర్స్‌‌‌‌ ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఉదయం సాయంత్రం 4 గంటల చొప్పున దానికి కేటాయించనున్నట్టు తెలిపారు. పంచ్‌‌‌‌ అయినా, కిక్‌‌‌‌ అయినా స్పీడ్‌‌‌‌ ఫైటింగ్‌‌‌‌, కికింగ్‌‌‌‌, స్పీడ్‌‌‌‌తో చేసే అంశాల్లో శిక్షణ ఇస్తానన్నారు. దేశానికి మంచి పేరు తీసుకొస్తూ పతకాలు సాధించే మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయాలనేదే తన లక్ష్యమంటున్నారు.

ప్రభుత్వ సహకారం కావాలె

మార్షల్‌ ఆర్ట్స్‌ లో రాణించాలని ఇటీవలి కాలంలో చాలామంది ముందుకు వస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే నా లక్ష్యం.ఇందుకు ప్రభుత్వ సహకారం కూడా కావాలి. క్రీడలకు, క్రీడాకారులను ప్రోత్సాహం దక్కాలి. నేను 4 దశాబ్దాల నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌ రంగంలో ఉన్నాను.ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించాను.మరింత మంది ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వాలనేదే నా లక్ష్యం.- జయంత్‌ రెడ్డి, గ్రాండ్‌ మాస్టర్